చేసిన తప్పుకి ఇదే శిక్ష : ఒక్కో మీడియా సంస్థకు రూ.10 లక్షల ఫైన్

delhi high courtజమ్ముకశ్మీర్ లోని కథువాలో ఇటీవల జరిగిన గ్యాంగ్ రేప్, మర్డర్ కు సంబంధించి కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహాన్ని ప్రదర్శించాయి. దీంతో అత్యాచారానికి గురైన బాలిక వివరాలు బయటకు రావడంతో పాటు..భవిష్యత్ లో బాధితురాలి కుటుంబానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయంటూ ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలిక వివరాలను బయటపెట్టిన మీడియా సంస్థలకు 10 లక్షల రూపాయల ఫైన్ విధించింది. ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గీతా మిట్టల్, న్యాయమూర్తి హరి శంకర్‌లతో కూడిన ధర్మాసనం ఈ విషయాన్ని సుమోటాగా స్వీకరించి విచారణ చేపట్టింది.

ఈ విషయంపై వివరణ ఇవ్వాలంటూ ధర్మాసనం శుక్రవారం(ఏప్రిల్-13) దేశంలోని పలు డేలీ పేపర్స్,  టీవీ చానళ్లకు నోటీసులు జారీ చేసింది. నిర్భయ కేసులో సంయమనం పాటించిన మీడియా ఈ కేసులో ఎందుకు అలా చేయలేకపోయిందని ప్రశ్నించింది. సున్నితమైన అంశాల్లో మీడియా సంస్థలు నిబంధనలకు లోబడి నడుచుకోవాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.

మీడియా సంస్థలకు విధించిన జరిమానా డబ్బును బాధితురాలి కుటుంబానికి కోర్టు అందేజేస్తుందని తెలిపింది. ఎవరైనా అత్యాచారానికి గురైన బాధితుల వివరాలను బహిర్గతం చేస్తే వారికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తామని ధర్మాసనం హెచ్చరించింది.

Posted in Uncategorized

Latest Updates