చేసేది కూలీపని.. సేవలో మారాజు : 10 వేల అనాధ శవాలకు అంత్యక్రియలు

మైసూరు : మనం చనిపోయాక పాడె మోసేందుకు ఓ నలుగురు ఉండాలంటారు. దిక్కులేనివారికి ఆ దేవేడు దిక్కు అంటారు. కానీ మనిషి రూపంలో నిజంగానే దేవుడయ్యాడు ఓ వ్యక్తి. అనాధ శవాలకు అంత్యక్రియలు చేస్తున్నాడు. ఒకటి కాదు..రెండు కాదు.. ఇప్పటివరకు ఏకంగా 10 వేలకు పైగా అంత్యక్రియలు చేశాడు. ప్రస్తుతం అందరినోటా మానవత్వానికి మారుపేరులా అతడి పేరు మారు మోగుతోంది.  వివరాల్లోకెళితే.. కర్ణాటకలోని మైసూరుకు చెందిన అయూబ్‌ అహ్మద్‌ (38) మార్కెట్‌లో కూలీగా పని చేస్తుంటాడు. దీంతోపాటు అనాధ శవాలకు అంత్యక్రియలు చేస్తుంటాడు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఏకంగా 10,000 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించాడు.

ఆ ప్రాంతంలో ఆయన అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. ఆయూబ్‌ దగ్గర మొత్తం 6 సెల్‌ ఫోన్‌ లు ఉంటాయి. ఎప్పుడూ ఫోన్‌ లో మాట్లాడుతూ.. బిజీగా ఉంటాడు. ఆయనకు ఫోన్‌ చేసేవారంతా సాయం కోసం చేసేవారే. ఆయనకు ఓ పాత అంబాసిడర్ కారు ఉంది. ప్రజలు, ఆస్పత్రులు, పోలీసులు ఆయనకు తరుచూ ఫోన్‌ చేస్తుంటారు. చిన్న పండుగలకు బస్తీ కూలీలను పిలిచి అన్నదానం చేస్తాడు. వృద్దులకు కావాల్సిన మెడిసిన్స్ కొనిస్తాడు. ఎవరైనా అనాధ శవాలు ఉన్నాయని తెలిస్తే చాలు..  మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించి, ఖననం చేయడానికి కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోతే ఆయనే ఆ పనిని చేస్తాడు.  ఎవరైనా డబ్బులిస్తే తీసుకుంటాడు. లేదంటే తన సొంత ఖర్చులతో అంత్యక్రియలు నిర్వహిస్తాడు.  20 ఏళ్లుగా ఆయన ఈ పని చేస్తున్నాడు. గుర్తు తెలియని మృతదేహాలు, ఆస్పత్రుల్లో మృతి చెంది బంధువులు ఎవరూ తీసుకుపోకుండా ఉన్న మృతదేహాలు వంటి వాటి అంత్యక్రియల బాధ్యతలను ఆయన తీసుకుంటున్నాడు.

ఆస్పత్రుల్లో పోస్ట్ మార్టం వంటి అన్ని ప్రక్రియలు ముగిసిన తర్వాత డాక్టర్లు ఆయనకు ఫోన్‌ చేస్తుంటారు. ఎక్కడైనా గుర్తు తెలియని డెడ్ బాడీ ఉన్నట్లు స్థానికులు గుర్తిస్తే.. అతనికి ఫోన్‌ చేస్తారు. చట్టబద్ధంగా అన్ని ప్రక్రియలు ముగిశాక ఆయన ఆ మృతదేహాలకు అంత్యక్రియలు జరుపుతాడు. ఆ మృతదేహాల ఫొటోలను అతను తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్ చేస్తుంటాడు. ఎందుకంటే వారు చనిపోయినట్లు ఒకవేళ వారి బంధువులకు తెలియకపోతే తెలుసుకుంటారని. ప్రస్తుతం ఈ న్యూన్ సోసల్ మీడియాలో వైరల్‌గా మారింది. కష్టాల్లో ఉన్న మనిషికి తోటి మనిషే సాయం చేయకుండా కఠినంగా వ్యవహరిస్తున్న రోజులివి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. మానవత్వం మరచి ప్రవర్తిస్తున్న మనుషుల మనస్తత్వాలకు భిన్నంగా వ్యవహరిస్తున్న అయూబ్‌.. నిజంగా నువ్వు గ్రేట్ బాసు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

 

 

Posted in Uncategorized

Latest Updates