చైతు చేతులమీదుగా.. బ్రాండ్ బాబు ట్రైలర్  

డైరెక్టర్ మారుతి కథతో తెరకెక్కిస్తున్నసినిమా బ్రాండ్ బాబు. సుమంత్ శైలేంద్ర హీరోగా పరిచయం అవుతున్న ఈ మూవీకి ప్రభాకర్.పి డైరెక్టర్. ఈషా రెబ్బా హీరోయిన్. షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకోవ‌డంతో సినిమాపై భారీ ఆస‌క్తి క‌లిగేలా ప్రమోష‌న్స్ చేస్తున్నారు. ఇటీవ‌ల టీజ‌ర్ విడుద‌ల చేసిన టీం..  గురువారం  (జూలై-26) ట్రైలర్ ను రిలీజ్ చేసింది. నాగ చైత‌న్య చేతుల మీదుగా ట్రైల‌ర్ విడుద‌ల చేయించారు. ట్రైల‌ర్‌ లో స‌న్నివేశాలు స‌ర‌దాగా క‌నిపించాయి.

ఏ వ‌స్తువులోనైన బ్రాండ్ చూసే అబ్బాయి పెళ్లి విష‌యంలో మాత్రం ..టీ స్టాల్ న‌డుపుకునే అమ్మాయితో ప్రేమ‌లో ప‌డ‌తాడని ట్రైల‌ర్‌ ని బ‌ట్టి అర్ధ‌మ‌వుతుంది. ఈ మూవీ అటు యూత్ ఇటు ఫ్యామిలీకి బాగా క‌నెక్ట్ అయ్యేలా క‌నిపిస్తుంది. ఇందులో మురళీశర్మ కీలకమైన పాత్ర పోషిస్తుండ‌గా, రాజారవీంద్ర .. సత్యం రాజేశ్ .. పూజిత పొన్నాడ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. బ్రాండ్ బాబు సినిమాతో హీరోగా తెలుగు తెరకి పరిచయమవుతోన్న సుమంత్ శైలేంద్రకి ఈ సినిమా ఎంతవరకూ కలిసొస్తుందో చూడాలి.


Posted in Uncategorized

Latest Updates