చైనాతో భారత్ కు మంచి బంధం ఉంది: రాజ్ నాథ్

RAJభాతర్, చైనా దేశాల మధ్య స్నేహ పూర్వక బంధం ఉందన్నారు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్. సరిహద్దు అంశాలపై రెండు దేశాల మధ్య ఏవైనా అభిప్రాయభేదాలు తలెత్తితే దానిపై ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతామన్నారు. చైనాతో మనకు మంచి సంబంధాలున్నాయని నమ్ముతున్నానని తెలిపారు. బోర్డర్ల విషయంలో ఇరుదేశాల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తితో ఇంతకు ముందు జరిపినట్టే చర్చలు కొనసాగిస్తామన్నారు రాజ్ నాథ్. జమ్మూకశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడులపై మాట్లాడుతూ.. భారత సైన్యం పోరాటపటిమను, సేవలను కొనియాడారు. జవాన్లపై ప్రతి ఒక్కరూ నమ్మకం ఉంచాలని ఉన్నారు. 2017లో ఉగ్రవాదుల ఏరివేతలో జవాన్లు ఘనవిజయాలు సాధించారన్నారు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్.

Posted in Uncategorized

Latest Updates