చైనాను ఎదుర్కొవడానికి సిద్ధం : నిర్మలా సీతారామన్

doklamడొక్లాంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొవడానికి భారత్‌ సిద్ధంగా ఉందన్నారు రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌. శత్రువులతో పోరాడటానికి చైనా సిద్ధంగా ఉందంటూ ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించింది నిర్మలా సీతారామన్. చైనాను ఎదుర్కొవడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు ఆమె.

భారత రాయబారి గౌతమ్‌ బంబావాలే శనివారం మాట్లాడుతూ.. భారత సరిహద్దులో స్టేటస్‌ క్యూను చైనా ఉల్లంఘిస్తే మళ్లీ డొక్లాం లాంటి ఘటన పునరావృతమవుతుందన్నారు. మునుపెన్నడూ చూడని ఘటనలను సైతం సరిహద్దులో భారత్‌ సిద్ధంగా ఉందని చెప్పారు.గత నెలలో రక్షణ శాఖ మంత్రి చైనా డొక్లాంలో హెలికాప్టర్లు, సెంట్రీ పోస్టులు, ట్రెంచెస్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోందని పార్లమెంట్‌లో పేర్కొన్నారు. గతేడాది జూన్‌ 16 నుంచి ఆగష్టు 18 వరకూ చైనా-భారత్‌ల మధ్య డొక్లాం సమస్య నెలకొంది.

 

Posted in Uncategorized

Latest Updates