చైనాలో రాకెట్ ట్రెయిన్…గంటకు 1000 కి.మీ. స్పీడ్

గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ట్రెయిన్ లో వెళ్లొచ్చు అంటేనే అమ్మో అంత స్పీడ్ గానా అంటాం. అలాంటిది గంటకు వెయ్యి కిలోమీటర్ల హైస్పీడ్ తో వెళ్తే …ఇంకేమయినా ఉందా… చైనాలో ఏరోస్పేస్ సైన్స్ కంపెనీ వాళ్లు అలాంటి ట్రైయిన్ నే తయారు చేస్తామంటున్నారు. ఇప్పటికే గంటకు 350 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ట్రెయిన్ చైనాలో నడుస్తుంది. ఇప్పుడు ఏకంగా గంటకు వెయ్యి కిలోమీటర్లు హైస్పీడ్ తో దూసుకుపోయే బుల్లెట్ ట్రైయిన్ తయారు చేసే ప్రాజెక్ట్ మొదలు పెట్టబోతుంది.

టీ ఫ్లైట్ అని పేరుతో ట్రెయిన్ మోడల్ ను చైనాలోని సిచువాన్ ఫ్రావిన్స్ లో జరిగిన నేషనల్ మాస్ ఇన్నోవేషన్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ లో శుక్రవారం పదర్శించింది. 29.2 మీటర్ల పొడవుతో, 3 మీటర్ల వెడల్పు ఉండే ఈ ట్రెయిన్ రూఫ్ హీట్ ని తట్టుకొనేలా డిజైన్ ఉంటుంది. మాగ్నటిక్ లావియేషన్ టెక్నాలజీతో రైలు పట్టాలపై 100 మిల్లీమీటర్ల పైనుంచి వెళ్తుంది. ప్యాసింజర్లు హాయిగా ప్రయాణం చేయవచ్చు అని షాంగై యూనివర్శిటీ సైంటిస్టులు చెబుతున్నారు. చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ కంపెనీ దీన్ని తయారు చేస్తోంది.

Posted in Uncategorized

Latest Updates