చైనా… కృత్రిమ చందమామలను తయారు చేస్తోంది

చైనా తరయారు చేసే బొమ్మలకు ప్రపంప వ్యాప్తంగా ఎంతో పేరు ఉండటంతో పాటు…మంచి మార్కెట్ కూడా ఉంది. క్వాలిటీ కూడా అదే స్థాయిలో ఉండటంతో కస్టమర్లు కూడా కొనేందుకు ఆసక్తి చూపుతారు. రకరకాల టాయిస్ ను తయారు చేయడమే కాదు.. కృత్రిమ చందమామలను కూడా తయారు చేస్తోంది చైనా. అక్కడ పెద్దపెద్ద నగరాల్లో వీధిదీపాల ఖర్చు తడిసిమోపెడు కావడం సాధారణమే. దీంతో ధగధగా వెలిగే చందమామను తెచ్చి నగరాల మీద నిలిపితే సరి అని ఆలోచించింది. పైగా ఈ కృత్రిమ చందమామలు అసలు చందమామల కన్నా ఎన్నోరెట్లు ఎక్కువ వెలుగునిస్తాయి. 2020 వరకు ఆకాశంలో నిలబెట్టాలని చైనా చూస్తోంది. నైరుతి ప్రాంతంలోని సిచువాన్ రాష్ట్రంలోగల చెంగ్‌డూ నగరంపై మొదటిగా జాబిలి వెలుగులు వెదజల్లనుంది. చంద్రునితో పాటే ఇవీ సూర్యుని కాంతిని సేకరించి నగరాలను కాంతివంతం చేస్తాయి.

Posted in Uncategorized

Latest Updates