చైనా-పాక్ మానవ హక్కులను తొక్కేస్తున్నాయి : బలూచిస్థాన్

baluchistanచైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ కు వ్యతిరేకంగా లండన్ లో బలూచిస్థాన్ ప్రజలు ఆందోళన కొనసాగిస్తున్నారు. లండన్ లోని చైనా ఎంబసీ ముందు ఆందోళనకు దిగారు. ఎకనమిక్ కారిడార్ పేరుతో చైనా-పాకిస్థాన్ లు మానవ హక్కులను తొక్కేస్తున్నాయని ఆరోపించారు. బలూచ్ ప్రజలను దారుణంగా అణగదొక్కుతున్నారన్నారు బలూచీ ప్రజలు. ఎకనమిక్ కారిడార్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న యువత కనిపించకుండా పోతున్నారని… వారంతా ఏమవుతున్నారని ప్రశ్నించారు.

Posted in Uncategorized

Latest Updates