చైనా వస్తువుల డెలివరీ బంద్

డీహెచ్ఎల్ నిర్ణయం
ముంబై: చైనా వస్తువులపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో లాజి-స్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్ డీహెచ్ఎల్ ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌ (ఇండియా) కీలక నిర్ణయం తీసుకుంది. పది రోజుల వరకు చైనాతోపాటు హాంకాంగ్, మకావ్ నుంచి షిప్మెంట్లు తీసుకోబోమని ప్రక-టించిం ది. ఈ మేరకు కస్టమర్లకు గురువారం సమాచారం కూడా అందజేసింది. చెన్నై సహా పలు పోర్టుల్లో కన్సైన్‌ మెంట్ లు నిలిచిపోయా-యని, కస్టమ్స్ క్లియరెన్స్ రాకపోవడమే ఇందుకు కారణమని వెల్లడించిం ది. కరోనా భయం వల్ల ప్రతి కన్సైన్‌ మెంటును జాగ్రత్తగా చెక్ చేస్తుండటం వల్ల ఆలస్యమవుతున్నదని కొందరు ట్రేడర్లు తెలిపారు. చెన్నైతోపాటు ఢిల్లీ ఎయిర్ కార్ గో టెర్మినల్, కోల్‌‌‌‌కతా ఎయిర్‌‌‌‌పోర్ట్, ముంబై నవ షేవా పోర్టులోనూ ఇదే పరిస్థితి ఉందని వెల్లడించారు. అన్ని పోర్టుల్లో, విమానాశ్రయాల్లో విపరీతమైన రద్దీ ఉందని డీహెచ్ఎల్ తెలియజేసింది.