చైన్‌స్నాచింగ్‌ ను అడ్డుకున్న మహిళలు

హైదరాబాద్ సిటీ శివార్లలోని హయత్ నగర్ మండలం పసుమాముల గ్రామం నారాయణ కళాశాల సమీపంలో చైన్‌స్నాచింగ్‌కు యత్నించిన దుండగులను అడ్డుకొన్నారు మహిళలు. ప్లాస్టిక్ కంపెనీలోనికి పనికి వెళుతున్న తారామతిపేట గ్రామానికి చెందిన గడ్డం లక్ష్మి(40) మెడలోంచి ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు పుస్తెల తాడు లాగేందుకు యత్నించారు. సమయ స్పూర్తితో తోటి మహిళలు అడ్డుకుని దుండగులపై దాడి దిగడంతో వారు తప్పించుకుని పరారయ్యారు. లక్ష్మికి గాయాలు కాగా ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీ టీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు పోలీసులు.

Posted in Uncategorized

Latest Updates