చోక్సీని భారత్ కు అప్పగిస్తాం : ఆంటిగ్వా విదేశాంగ మంత్రి

పంజాబ్ నేషనల్ బ్యాంక్ 13 వేల కోట్ల కుంభకోణం కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడైన మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించే విషయంలో తమ పూర్తి సహకారం అందిస్తామన్నారు ఆంటిగ్వా అండ్ బర్బుడా విదేశాంగ శాఖ మంత్రి ఛెత్ గ్రీనీ. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 73వ సెషన్ సందర్భంగా…భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ తో ఆంటిగ్వా విదేశాంగ మంత్రి ఛెత్ గ్రీనీ సమావేశమయ్యాడు. ఈ సమావేశ సమయంలో…. మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించే విషయాన్ని సుష్మాస్వరాజ్ ప్రస్తావించగా దానికి సానుకూలంగా స్పందించాడు ఛెత్ గ్రీని. చట్టపరంగా ఉన్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించి…. చోక్సీని భారత్ కు అప్పగించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆంటిగ్వా మంత్రి గ్రీనీ.. సుష్మా స్వరాజ్‌కు చెప్పినట్లు విదేశాంగ ప్రతినిధి రవీశ్‌కుమార్‌ తెలిపారు .

పీఎన్ బీ కేసులో ప్రధాన నిందుతుల్లో ఒకడైన చోక్సీ ప్రస్తుతం ఆంటిగ్వాలో ఉంటున్నాడు. చోక్సీకి ఆంటిగ్వా పౌరసత్వం కూడా ఉంది. చోక్సీని అప్పగించేందుకు భారత్‌ కు సహకరించాల్సిందిగా సీబీఐ అధికారులు ఆంటిగ్వా అధికారులకు ఇప్పటికే లేఖ రాశారు.

Posted in Uncategorized

Latest Updates