చ‌ట్ట స‌భ‌ల్లో బీసీల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్లు కల్పించాలి

ఢిల్లీ : కేంద్రమంత్రి థావర్‌ చంద్‌ గెహ్లాట్‌ ను కలిశారు  టీఆర్ఎస్ ఎంపీలు. కేంద్రంలో బీసీల కోసం ప్రత్యేకంగా ఓ మంత్రిత్వ శాఖ కేటాయించాల‌ని.. చ‌ట్ట స‌భ‌ల్లో బీసీల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్లు కల్పించాల‌ంటూ వినతిపత్రం ఇచ్చారు. నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్ వర్డ్ క్లాస్ కు చైర్మ‌న్ ను నియామించాల‌ని డిమాండ్ చేశారు. NCBC ఏర్పాటు చేసి, 9 నెల‌లు అవుతున్నా.. కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కు చైర్మ‌న్ ను నియ‌మించ‌లేదని చెప్పారు.  ఏక్‌ దేశ్‌- ఏక్‌ నీతి ఉండాల‌న్న‌దే కేసీఆర్ నినాదమని చెప్పారు ఎంపీలు.

ఇదివరకే.. బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలని కోరామని… ఇప్పటివరకు కేంద్రం స్పందించలేదన్నారు. రిజర్వేషన్ల విషయంలోనూ రాష్ట్రాలకే నిర్ణయాధికారం ఉండాలని చెప్పారు. ప్ర‌స్తుతం తమిళ‌నాడు, మహారాష్ట్ర, చ‌త్తీస్ గఢ్ ల‌లో ఒక్కో ర‌కంగా రిజ‌ర్వేష‌న్లు అమ‌లవుతున్నాయని.. సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపి, తెలంగాణకు రిజ‌ర్వేష‌న్ల పెంపును అడ్డుకుంటున్నారన్నారు ఎంపీలు.

Posted in Uncategorized

Latest Updates