ఛత్తీస్‌గఢ్‌ మంత్రి వర్గంలోకి మరో 9మంది ఎమ్మెల్యేలు

ఛత్తీస్‌గఢ్‌ సీఎంగా ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేసిన…భూపేశ్ భగల్ ప్రమాణ స్వీకారం చేశారు…ఇవాళ(మంగళవారం) 9మంది ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆనందిబెన్ పటేల్ కొత్త మంత్రుల చేత ప్రమాణం చేయించారు. 9మందిలో ఒక మహిళా ఎమ్మెల్యేకు మంత్రిగా అవకాశం కల్పించారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో.. కవాసీ లక్మా, అనిలా బేడియా, జైసింగ్ అగర్వాల్, రుద్ర గురు, రవీంద్ర చౌబే, మహ్మద్ అక్బర్, ఉమేశ్ పటేల్, శివ కుమార్ దహారియా, ప్రేం సాయి సింగ్ తెక్కం ఉన్నారు.

ఈనెల 17న సీఎంగా భూపేశ్ భగల్ తో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు సింగ్ దేవ్, తమ్రద్వాజ్ సాహు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ మరో తొమ్మిది మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేయడంతో మంత్రివర్గం సంఖ్య 12కి చేరింది.

Posted in Uncategorized

Latest Updates