ఛత్తీస్‌గఢ్‌ లో కాల్పులు: ఇద్దరు BSF జవాన్లు మృతి

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని కాంకేర్‌ జిల్లాలో మావోయిస్టులు..BSF జవాన్ల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. కాల్పుల్లో ఇద్దరు BSF జవాన్లు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. చత్తీస్‌గఢ్ రాష్ట్రం కాకంకేర్ జిల్లాలో BSF జవాన్లు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రతాపపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోహ్లా అటవీ ప్రాంతంలో భద్రత బలగాలకు తారసపడ్డ మావోయిస్టులు వారిపై ఎదురు దాడికి దిగారు. రెండువర్గాల మధ్య సుమారు 45 నిమిషాల పాటు జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు BSF జవాన్లు మృతి చెందారు. మావోయిస్టులు- BSF జవాన్ల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.

 

Posted in Uncategorized

Latest Updates