ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్: ముగ్గురు మావోలు మృతి

Naxalపోలీసులే టార్గెట్ గా కాల్పులకు తెగబడుతున్నారు మావోయిస్టులు. వారికి ధీటుగా దాడులును తిప్పికొడుతున్నారు. కొద్ది రోజులుగా పోలీసులకు, మావోలకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి.

ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాలకు, నక్సలైట్లకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. దంతెవాడ- సుక్మా సరిహద్దుల్లో శుక్రవారం(జులై-6)  పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. కాల్పుల్లో ఒక జవాన్ కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన జవాన్ ను స్థానిక ఆస్పత్రిక తరలించారు. దంతెవాడ- సుక్మా సరిహద్దుల్లో పోలీసుల కూంబింగ్ ఇంకా కొనసాగుతోందన్నారు డీఐజీ సుందర్ రాజ్.

 

Posted in Uncategorized

Latest Updates