ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్.. ముగ్గురు మావోల మృతి

ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో పోలీసులకు,మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించగా.. ఒక మావోయిస్టును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  డిస్ర్టిక్ట్ రిజర్వ్ గార్డ్‌(డిఆర్‌జి) ఫోర్స్ .. మర్కగుడా-ముల్లేరు అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ చేస్తున్న సమయంలో ఈ ఎదురుకాల్పులు జరిగాయని పోలీస్ అధికారులు తెలిపారు.  ఘటనా స్థలం నుంచి కొన్ని ఆయుధాలు,వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates