జకీర్ నాయక్ ఆస్తుల జప్తు

విదేశాలకు పారిపోయిన ఐఎస్ టెర్రరిస్ట్ జకీర్ నాయక్ ఆస్తులను జప్తు చేయాలంటూఎన్ ఐఏ స్పెషల్ కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. మైంబైలోని మజ్ గావ్ లో జకీర్ పేరుపై ఉన్న రెండు ఫ్లాట్లను, ఓ కమర్షియల్ బిల్డింగ్ లను అటాచ్ చేయడానికి కోర్టు అనుమతిచ్చింది. పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న జకీర్ కోర్టు విచారణకు హాజరుకాకపోవడం, విదేశాలకు పారిపోవడంతో రెండేళ్ల కిందట కోర్టు ఆయనను నేరస్ధుడిగా తేల్చింది. దీంతో నాయక్ ఇండియా బయటే స్ధిరపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని ఎన్ ఐఏ లాయర్ ఆరోపించారు. పౌరసత్వం కోసం చాలా దేశాలకు అప్లికేషన్ పెట్టుకున్నాడని, ఇండియాలోని ఆస్తులు అమ్మేసే ప్రయత్నం చేస్తున్నాడని కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో ముంబైలోని నాయక్ ఆస్తులను అటాచ్ చేసేందుకు అనుమతించాలంటూ కోర్టుని కోరారు. ఈ పిటీషన్ పరిశీలించి, లాయర్ వాదన అంగీకరిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు.

Posted in Uncategorized

Latest Updates