జగదాంబ అమ్మవారికి  తొలి బోనం: షురూ అయిన ఉత్సవాలు


భాగ్యనగరంలో ఆషాడ బోనాల సందడి మొదలైంది. గోల్కొండ కోట జగదాంబ అమ్మవారికి  తొలి బోనంతో ఉత్సవాలు షురూ అయ్యాయి.  మధ్యాహ్నం 12 గంటలకు లంగర్ హౌస్ లో మంత్రులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిచడంతో తొట్టేల ఊరేగింపు  మొదలు కానుంది. ఊరేగింపు మొదట బడా బజార్ లోని పూజారి ఇంటికి  చేరుకుంటుంది. అక్కడ అమ్మవారికి  ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఉత్సవ విగ్రహం ఊరేగింపు ప్రారంభమువుతుంది. తర్వాత  బజార్ దర్వాజా దగ్గర అమ్మవారికి పటేలమ్మ సాక సమర్పించాక సాయంత్రం కోటపైకి చేరుకుంటుంది.

పూజారి ఇంట్లో  ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తొట్టెల ఊరేగింపు లంగర్ హౌస్ నుంచి గోల్కొండ వరకు కొనసాగనుంది. లంగర్ హౌస్, చెరువుకట్ట, ఫతేదర్వాజా, చోటాబజార్ ల మీదుగా ఊరేగింపు కోటపైకి చేరుకోనుంది. గోల్కొండ ఆలయానికి వెళ్లే మెట్లను పసుపు, కుంకుమలతో భక్తులు ఇప్పటికే అలంకరించారు. ఆలయం దగ్గర పోలీసుశాఖ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసింది.

భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. అన్ని శాఖల ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సౌకర్యాలను పరిశీలించారు . ఈ సంబురాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించడంతో ఎక్కడా ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates