జగన్నాథుని రథయాత్ర: భారీ ఎత్తున తరలివచ్చిన భక్తులు

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు జగన్నాథుని రథయాత్ర పూరిలో ఘనంగా మొదలైంది. శనివారం (జూలై-14) ఉదయం పవాండి నుంచి సంబురాలు మొదలయ్యాయి.  విగ్రహమూర్తులను ఊరేగింపు కోసం రథం వరకు తీసుకొచ్చారు ఆలయ అధికారులు. సింహాద్వారం నుంచి జగన్నాథుడు జలభద్ర, సుభద్రలతో కలిసి రథాలపై…..పెంచిన తల్లి గుండిచా మందిరానికి చేరుకోనున్నారు. యాత్రను తిలకించడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రథయాత్ర సాగే దారి మొత్తం పురుషోత్తమ నామస్మరణతో మార్మోగుతోంది. రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు యాత్రలో పాల్గొంటున్నారు. ఇప్పటికే వచ్చిన భక్తులతో మఠాలు, ఆశ్రమాలు, ధర్మశాలలు, హోటళ్లు నిండిపోయాయి. రథయాత్రలో మొదటి రోజున కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ పాల్గొన్నారు.

ఒడిశా ప్రభుత్వం రథయాత్రను విజయవంతం చేయడానికి విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. జగన్నాథుడి యాత్ర క్రమంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Posted in Uncategorized

Latest Updates