జగన్‌ సవాల్‌ను స్వీకరిస్తున్నా: పవన్‌

pawan-kalyanవిభజన చట్టంలోని హామీల అమలు కోసం పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి సంబంధించి… వైసీపీ అధినేత జగ న్ విసిరిన సవాల్‌‌ను స్వీకరిస్తున్నానన్నారు జనసేన అధినేత, పవన్ కల్యాణ్.

సోమవారం (ఫిబ్రవరి-19) హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. అవిశ్వాస తీర్మానంపై జగన్‌‌ విసిరిన సవాల్‌‌కు స్పందించారు. అన్నింటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఒక్క ఎంపీతో నైనా అవిశ్వాస తీర్మానం పెట్టొచ్చు అన్నారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు కావాలన్నారు. మీకు కావాల్సిన మద్దతు నేనిస్తాను అన్నారు. మార్చి 4వ తేదీన నేను ఢిల్లీకి వస్తానన్న పవన్.. అందరు ఎంపీల మద్దతు కూడగడతానన్నారు. ముందు జగన్‌ అవిశ్వాస తీర్మానం పెట్టాలి అని తేల్చి చెప్పారు పవన్ కల్యాణ్.

Posted in Uncategorized

Latest Updates