జగన్ పాదయాత్రలో తేనెటీగల దాడి..10 మందికి గాయాలు

JAGANవైసీపీ  అధ్యక్షులు  జగన్మోహన్ రెడ్డి  పాదయాత్రపై.. తేనెటీగలు  దాడిచేశాయి. గురువారం (జూన్-7) పశ్చిమ గోదావరి  జిల్లాలోని …కానూరు  క్రాస్ రోడ్డు  దగ్గరకు  పాదయాత్ర  చేరుకోగానే.. ఒక్కసారిగా  తేనెటీగలు  చుట్టుముట్టాయి.  జగన్  సెక్యూరిటీ సిబ్బంది  వెంటనే అప్రమత్తమయ్యారు.  వైసీపీ  అధినేతకు  తేనెటీగలు  కుట్టకుండా  జాగ్రత్తలు  తీసుకునే ప్రయత్నం  చేశారు.

తమ చేతిలోని  టవళ్లు,  కండువాలను  ఊపుతూ… జగన్ చుట్టూ చేరారు.  భద్రతా  సిబ్బందితో  పాటు … కొందరు కార్యకర్తలు  కూడా  జగన్ దగ్గరకు తేనెటీగలు  రాకుండా  కండువ  ఊపుతూ  చెదరగొట్టే  ప్రయత్నం చేశారు.  తేనెటీగల దాడితో  ప్రజా సంకల్పయాత్రలో  పాల్గొన్న  10 మందికి  గాయాలయ్యాయి. వారిని  వెంటనే ఆసుపత్రికి  తరలించి  వైద్యం అందించాలని  నేతలకు  సూచించారు జగన్.

Posted in Uncategorized

Latest Updates