జగన్ వల్ల కాపు నేతల జీవితాలు నాశనం : ముద్రగడ

వైసీపీ అధినేత జగన్ వల్ల …కాపు రాజకీయ నేతల జీవితాలు, కుటుంబాలు నాశనమవుతున్నయి అన్నారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. జగన్ పాదయాత్రకు ప్రజలను తరలించేందుకు, ఫ్లెక్సీలు కట్టడానికి కాపు సోదరులు తమ ఆస్తులు అమ్మకుంటున్నారన్నారు. ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు నేతలతో…. లక్షల రూపాయలు ఖర్చు పెట్టిస్తున్నారని ఆరోపించారు. కాపు రిజర్వేషన్లు సాధ్యం కాదని చెప్పిన జగన్ కు…. తమ జాతి ఓట్లడిగే అర్హత లేదన్నారు ముద్రగడ. తుని ఘటన తరవాత.. జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ కాపు రిజర్యేషన్‌ లకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారని, అసెంబ్లీలోనూ మద్దతు పలికారని గుర్తు చేశారు. ఇప్పుడు రాష్ట్ర పరిధిలో అంశం కాదని, జగన్ యూటర్న్ తీసుకోవడం బాధాకరమని అన్నారు. కాపులు ఎప్పుడూ మీ మోచేతి నీళ్ళు తాగుతూ మీ పల్లకీలే మోస్తూ ఉండాలా అంటూ ఆయన సీరియస్ అయ్యారు.

Posted in Uncategorized

Latest Updates