జగ్గారెడ్డికి బెయిల్‌ మంజూరు 

కాంగ్రెస్‌ నాయకుడు జగ్గారెడ్డికి బెయిల్‌ మంజూరైంది. మానవ అక్రమ రవాణా కేసులో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి షరతులతో కూడిన బెయిల్ ను ఇవాళ (సోమవారం) సికింద్రాబాద్ కోర్టు మంజూరు చేసింది. రూ. 50 వేల పూచీకత్తుతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి ఆదివారం మార్కెట్ పోలీసు స్టేషన్‌లో హాజరు కావాలని జగ్గారెడ్డికి కోర్టు సూచించింది.ఇవాళ జగ్గారెడ్డి జైలునుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.

మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డిని ఈ నెల 10న రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత జగ్గారెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దీంతో జగ్గారెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఆ తర్వాత మూడు రోజుల పోలీసు కస్టడీ కోసం ఈ నెల 19న జగ్గారెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించారు.

Posted in Uncategorized

Latest Updates