జడ్జి కుర్చీలో కూర్చొని సెల్ఫీలు : ఆ కానిస్టేబుల్ కు జైలు శిక్ష తప్పదు

judge సెల్ఫీ సరదా ఓ పోలీస్ ట్రెయినీని కటకటాల వెనక్కు నెట్టింది. మరికొన్ని రోజుల్లో ట్రైనింగ్ పూర్తి చేసుకుని నేరస్ధులను కటకటాల్లోకి నెట్టవలసిన వ్యక్తే.. సరదా కోసం ప్రయత్నించి కటకటాలపాలయ్యాడు. ఇంతకీ అతడు చేసింది ఓ కుర్చీలో కూర్చొని సెల్ఫీ దిగడమే.
శనివారం(జూన్-30) ఉదయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉమరియా కోర్టులోని చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కేపీ సింగ్ రూమ్ లో ఎవ్వరూ లేని సమయంలో.. ట్రైనీ కానిస్టేబుల్ రామ్ అవ్ తార్ రావత్.. జడ్జి కుర్చీలో కూర్చొని తన ఫోన్ తో సెల్పీలు తీసుకోవడం ప్రారంభించాడు. అదే సమయంలో రూము డోర్లు ఓపెన్ చేశాడు ఓ కోర్టు ఉద్యోగి. జడ్జి కుర్చీలో కూర్చొని సెల్ఫీలు దిగుతున్న ట్రైనీ కానిస్టేబుల్ ను చూసి షాక్ అయ్యాడు. ఏం చేస్తున్నావ్ అంటూ ప్రశ్నించాడు కోర్టు ఉద్యోగి.

దీంతో నన్నే అంటావా… నేను పోలీసుని.. నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను.. నువ్వేం చేయగలవ్ అంటూ అతడిని తిట్టాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీస్ అధికారులు రావత్ ను కస్టడీలోకి తీసుకున్నారు. చొరబాటు యత్నం కింద పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. పోలీస్ అకాడమీలో ట్రైనీగా ఉన్నాననే ధైర్యంతోనే సరదా కోసం జడ్జి సీటులో కూర్చొని సెల్ఫీ తీసుకున్నానని రావత్ తెలిపాడు. రావత్ కు బెయిల్ వచ్చినప్పటికీ.. అతడికి ఈ కేసులో ఏడాది జైలు శిక్ష లేదా ఫైన్ లేదా రెండు పడే అవకాశమున్నట్లు న్యాయ నిపుణులు చెబుతున్నారు. కోర్టు ధిక్కారమే కాకుండా.. ప్రశ్నించిన కోర్టు ఉద్యోగిపై సైతం దుర్భాషలాడినందుకు  శిక్ష పడే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates