జడ్జి ఫ్యామిలీ, పోలీసులపై గన్ మెన్ కాల్పులు

ఢిల్లీ : తన అధికారిని కంటికి రెప్పలా కాపాడాల్సిన గన్ మెనే ఆయనపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ సంఘటన ఇవాళ (అక్టోబర్-13)న ఢిల్లీలో జరిగింది. గురుగ్రాం జిల్లా సెషన్స్‌ కోర్టు అదనపు జడ్జి కృష్ణ కాంత్‌ శర్మ భార్య, కుమారుడిపై ఆయన గన్‌ మెన్‌ కాల్పులు జరిపాడు. రద్దీగా ఉన్న మర్కెట్‌ లో గన్ మెన్  కాల్పులకు తెగబడటంతో..స్థానికంగా కలకలం రేపింది. జడ్జి కుమారుడిని తనతో పాటే తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా.. అక్కుడున్న వారు అడ్డుకోవడంతో .. గన్‌ మెన్  కారు తీసుకుని పారిపోయాడు.

ఇంతటితో ఆగని గన్ మెన్.. సర్దార్‌ పోలీసు స్టేషను దగ్గర ఉన్న పోలీసులపై కూడా కాల్పులు జరిపి ఉడాయించాడు. అయితే ఈ ఘటనలో వారికేమీ గాయాలు కాలేదు. గన్‌ మెన్‌ దాడిలో గాయపడిన బాధితులను హస్పిటల్ లో చేర్చినట్లు తెలిపిన పోలీసులు..  నిందితుడు  కొంత కాలంగా డిప్రెషన్‌ తో బాధపడుతున్నాడని, ఈ క్రమంలో కాల్పులు జరిపి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు.  ఈ ఘటనను తేలికగా తీసుకోవడం లేదని, నిందితుడిని అదుపులోకి తీసుకుని లోతుగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు పోలీసులు.

 

 

Posted in Uncategorized

Latest Updates