జడ్జీలకు పనిదినాల్లో సెలవులు రద్దు..!

జడ్జీలకు పనిదినాల్లో ‘నో లీవ్‌’ పాలసీని భారత చీఫ్ జస్టిస్ రంజన్‌ గొగోయ్‌ ముందుకు తెచ్చారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఈనెల 3న ప్రమాణ స్వీకారం చేసిన రోజే జస్టిస్‌ గొగోయ్‌..కోర్టు పెండింగ్‌ కేసుల క్లియరెన్స్‌ కోసం పనిదినాల్లో సెలవులు తీసుకోరాదనే విధాన నిర్ణయంపై సంకేతాలు పంపినట్టు సమాచారం. హైకోర్టుల్లో జడ్జీలు పనిదినాల్లో సెలవులు తీసుకోకుండా… కోర్టు రూముల్లో విధిగా హాజరుకావాలని జస్టిస్‌ గొగోయ్‌ స్పష్టంగా చెప్పినట్టు ఓ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తెలిపినట్లు ఓ పత్రిక ప్రకటించింది.

 

 

Posted in Uncategorized

Latest Updates