జనం సొమ్ము తింటే ఇంతే : నవాజ్‌ షరీఫ్‌కు పదేళ్ల జైలు

sharif-maryamపాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు పదేళ్ల జైలుశిక్ష పడింది. అవినీతి కేసులో నవాజ్‌ షరీఫ్‌ దోషిగా తేలడంతో కోర్టు 10ఏళ్ల జైలుశిక్ష విధించింది పాక్ సుప్రీం కోర్టు. నవాజ్‌ షరీఫ్‌తో పాటు ఆయన కూతురు మరియామ్‌కు 7ఏళ్ల జైలుశిక్ష పడింది. అవెన్‌ఫీల్డ్ అవినీతి కేసులో నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో వేసిన పిటిషన్ ఆధారంగా ఈ శిక్షను ఖరారు చేశారు. కోర్టు 1 జడ్జి మొహమ్మద్ బషీర్ శుక్రవారం(జులై-6) ఈ తీర్పు చెప్పారు. నవాజ్ షరీఫ్ అల్లుడు రిటైర్డ్ కెప్టెన్ సఫ్దర్‌కు ఏడాది జైలు శిక్ష విధించారు. శుక్రవారం ఉదయం నుంచి మూడుసార్లు వాయిదా తర్వాత ఈ తీర్పునిచ్చారు. నవాజ్ షరీఫ్ కుటుంబం ప్రస్తుతం లండన్‌లో ఉంది.

జులై 25న పాకిస్తాన్ లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి మూడు వారాల ముందుగానే నవాజ్ కు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటానికి వీలు లేకుండా పోయింది. ఇప్పటికే ఆయన కుమార్తెను రంగంలోకి దింపుతామని వ్యూహాలు రచిస్తున్నారు. అయితే ఆయన కుమార్తెకు కూడా ఏడేళ్లు శిక్ష పడటంతో ఆమె రాజకీయ భవిష్యత్ కూడా ప్రశ్నార్థకంగా మారింది.

Posted in Uncategorized

Latest Updates