జనకుడి గెటప్ లో కేంద్ర మంత్రి హర్షవర్ధన్

న్యూఢిల్లీ: జ‌న‌క మ‌హారాజు పాత్రలో ప్రేక్షకులను మెప్పించారు కేంద్ర మంత్రి హర్షవర్ధన్. ఢిల్లీలో నిన్న(శుక్రవారం) జరిగిన రామ్‌లీలా నాటకంలో హర్షవర్ధన్ జనకుడి పాత్ర పోషించారు. సీతాదేవి తండ్రి అయిన జనక మహారాజు పాత్రలో కేంద్ర మంత్రి హర్షవర్ధన్ అందరినీ ఆకట్టుకున్నారు. సీత స్వయంవరానికి ఆహ్వానం పలుకుతూ జనకుడి పాత్రలో కేంద్ర మంత్రి చేసిన డైలాగ్స్‌కు అందరూ ఫిదా అయ్యారు. హర్షవర్థన్ తన నాటకానికి సంబంధించిన ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తో పాటు ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యే విద్యేంద్ర గుప్తా కూడా ఈ నాటకంలో మహర్షి అత్రి పాత్రలో నటించారు.

Posted in Uncategorized

Latest Updates