జనవరి 9న NTR కథానాయకుడు.. జనవరి 24న మహానాయకుడు

హైదరాబాద్ : బాలకృష్ణ టైటిల్ రోల్ లో నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ గురించి ఆసక్తికరమైన విషయాలను ప్రకటించారు ఆ సినిమా యూనిట్. ఎన్టీఆర్ బయోపిక్ ను రెండు పార్టులుగా విడుదల చేస్తున్నారు. ఎన్టీఆర్ కథానాయకుడు… ఎన్టీఆర్ మహానాయకుడు పేర్లతో ఈ సిినిమాలు పదిహేను రోజుల గ్యాప్ లో విడుదల కానున్నాయి. వీటి విడుదల తేదీలను కూడా సినిమా యూనిట్…. సోషల్ మీడియాలో ప్రకటించింది.

అతను కథగా మారితే “కథానాయకుడు”… అతనే ఓ చరిత్రయితే “మహానాయకుడు” అని సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న దగ్గుబాటి రానా ట్విట్టర్ లో చెప్పాడు. ఎన్టీఆర్ బయోపిక్ లో దగ్గుబాట ిరానా… చంద్రబాబు నాయుడి పాత్ర పోషిస్తున్నారు. ఉదయాన్నే ఓ ట్వీట్ చేసిన రానా.. సాయంత్రం వరకు ఎదురుచూడండి.. ఇంట్రస్టింగ్ విషయం ఒకటి చెబుతాను అని చెప్పాడు. అన్నట్టే… సినిమాను రెండు పార్టులుగా విడుదల చేయబోతున్నారన్న సంగతిని బయటపెట్టాడు.

జనవరి 9న సంక్రాంతికి ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా విడుదలవుతుంది. జనవరి 24న రిపబ్లిక్ డేకి ఎన్టీఆర్ మహానాయకుడు మూవీ రిలీజ్ కానుంది. కథానాయకుడు సినిమాలో ఎన్టీఆర్ సినిమా లైఫ్ హైలైట్ అవుతుందని… మహానాయకుడు సినిమాలో ఆయన పొలిటికల్ కెరీర్ ప్రధానంగా సాగుతుందని చిత్రవర్గాలు తెలిపాయి.

Posted in Uncategorized

Latest Updates