జనసేనలోకి మాజీ క్రికెటర్

janasenavenuభారత క్రికెట్‌ జట్టు మాజీ ఆటగాడు వేణుగోపాలరావు గురువారం జనసేన పార్టీలో చేరారు. విశాఖలో జనసేన అధినేత పవన్‌ సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. పవన్‌ అభిమానులు సైతం భారీ సంఖ్యలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ జనసేన పార్టీ సుదీర్ఘ కాలం ప్రజా సమస్యలపై పోరాటమే లక్ష్యంగా పని చేస్తోందన్నారు. 2019లో జనసేన కచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. పోరాటయాత్రలో భాగంగా పవన్‌ విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు.

భారత్‌ తరపున 2005లో ఆరంగ్రేటం చేసిన వేణుగోపాలరావు శ్రీలంకతో తొలి వన్డే, 2006లో వెస్టిండీస్‌పై చివరి వన్డే ఆడారు. 16 మ్యాచ్‌ల్లో 218 పరుగులు చేశారు.

Posted in Uncategorized

Latest Updates