జనసేన దయతోనే చంద్రబాబు సీఎం అయ్యారు : పవన్

PKచంద్రబాబు సీఎం అయ్యారంటే అది జనసేన వల్లేనన్నారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్. మంగళవారం (మే-22) శ్రీకాకుళం జిల్లా పోరాట యాత్రలో భాగంగా పలాసలో పర్యటించారు. మత్స్యకారుల పరిస్థితి కంటతడి పెట్టించిందన్నారు. జనం ఆశీస్సులుంటే సీఎం అవుతానన్నారు పవన్. ఎక్కడైతే దోపిడీ, దౌర్జన్యాలుంటాయో అక్కడ తిరుగుబాటు ఖచ్చితంగా వస్తుందన్నారు. అన్యాయానికి వ్యతిరేకంగా నిరసన గళం విప్పి అవసరమైతే కదంతొక్కే నేల శ్రీకాకుళమని..రక్తం చిందిండానికైనా ఈ నేల వెనుకాడబోదని స్పష్టం చేశారు. ప్రభుత్వాలు నేటి యువతరానికి కష్టాలు, కన్నీళ్లు, బాధలు తప్ప ఏమీ మిగల్చలేదన్నారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయానికి కడుపుమండి తాను ప్రజల ముందుకు వచ్చానన్నారు పవన్.

Posted in Uncategorized

Latest Updates