జనాభా ప్రాతిపదికన పంచాయతీ రిజర్వేషన్లు కేటాయించాలి : ఉత్తమ్

జనాభా ఆధారంగా బీసీలకు రిజర్వేషన్ కేటాయించాలన్నారు విపక్ష నేతలు. ఈ విషయంపై చర్చించేందుకు ప్రభుత్వం అఖిలపక్ష సమావేవం ఏర్పాటు చేయాలన్నారు. బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు నేతలు.

పంచాయతీ రిజర్వేషన్ల విషయంలో బీసీలను ప్రభుత్వం మోసం చేసిందన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన దానికి .. చేస్తున్నదానికి పూర్తి విరుద్ధంగా ఉందన్నారు.  జనాభా ప్రాతిపదికన పంచాయతీ రిజర్వేషన్లు కేటాయించాలన్నారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్న ఉత్తమ్ .. బీసీ రిజర్వేషన్లపై కోర్టులో కేసు వేయలేదని చెప్పారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ జరిగిన అఖిలపక్ష సమావేశంలో మాట్లాడారు ఉత్తమ్.

పంచాయితీ ఎన్నికలు వాయిదా వేసేందుకు సర్కార్  ప్లాన్ చేసిందన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు పెద్దిరెడ్డి. రిజర్వేషన్ల విషయంలో కోర్ట్ లో సర్కార్ తరపున సరైన డాక్యుమెంట్స్ చూపలేకపోయిందన్నారు.  కావాలనే ప్రభుత్వం ఇదంతా చేసిందన్నారు పెద్దిరెడ్డి.

రిజర్వేషన్ శాతం పెంచాలని బీసీలు పోరాడుతుంటే … ప్రభుత్వం మరింత తగ్గించాలని చూస్తోందన్నారు ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం పెట్టాలన్నారు. పార్లమెంటులో రాజ్యాంగ సవరణ కోసం ముఖ్యమంత్రి ప్రధానిని కలవాలన్నారు కృష్ణయ్య. పంచాయతీ రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకోబోమన్నారు పార్టీల నేతలు.

 

Posted in Uncategorized

Latest Updates