జపాన్‌‌కు వరద కష్టాలు..

సౌత్ జపాన్ ను భారీ వానలు, వరదలు ముంచెత్తుతున్నాయి. వీటికి తోడు కొండచరియలు విరిగిపడుతుండటంతో తీవ్ర నష్టం వాటిల్లింది. హితొయోషి లోని కుమా నది పొంగి పొర్లడంతో లోతట్టు ప్రాంతాలు వరదనీటిలో మునిగిపోయాయి. వరదల్లో 12 మందికిపైగా కొట్టుకుపోయారు. కుమమాటో, కగోషిమా టౌన్లలోని 75 వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు 10 వేల మంది డిఫెన్స్ సిబ్బందితో రెస్క్యూ టీమ్ ను ఏర్పాటు చేశారు.

Latest Updates