జపాన్ ఇలా ఉంది : భూకంపం, భారీ వర్షాలు, మెరుపు వరదలు


జపాన్ అంటే ఠక్కున గుర్తు వచ్చే భూపంపాలు. ఇప్పుడు అందుకు మరో విపత్తు తోడైంది. భూపంకంతోపాటు భారీ వర్షాలు పడుతున్నాయి. అంతేకాకుండా మెరుపు వరదలు జపాన్ దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. ఒకేసారి ఇన్ని విపత్తులు దేశాన్ని చుట్టుముట్టటంతో.. అత్యవసర పరిస్థితిని ప్రకటించింది జపాన్ ప్రభుత్వం. కుండపోత అంటే పదానికి అర్థాన్నే మార్చేశాయి జపాన్ లోని వర్షాలు. రెండు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నా.. ఆదివారం పడిన అతి భారీ, భారీ వర్షాలు మాత్రం జపాన్ దేశంలోని కొన్ని ప్రాంతాలను నీటితో ముంచెత్తింది.
సౌత్ వెస్ట్రన్ లోని హిరోషిమా, కియోటో, షిగా, గిఫూ, కొచ్చి, యవగుచి, సాగ, ఫుకోక, హియోగో, ఒకయామా ప్రాంతాల్లో అతి భారీ వర్షాలకు నదులు పోటెత్తాయి. ఉవాజిమా సిటీలో కేవలం రెండు అంటే రెండు గంటల్లోనే 364 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. అంటే ఇది పడి కుండపోత వర్షాలతో సమానం. ఇక సుకుమో సిటీలో ఆదివారం ఉదయం 5 నుంచి 7 గంటల సమయం మధ్య.. రెండు గంటల్లో 263 మిల్లీమీటర్ల వర్షం పడింది. దీంతో ఈ రెండు సిటీలు నీటిలో మునిగిపోయాయి. ప్రజలు ఇళ్లపైకి ఎక్కారు. అక్కడికి నీళ్లు పోటెత్తటంతో.. పదుల సంఖ్య ప్రజలు కొట్టుకుపోయారు.
ఇప్పటి వరకు 120 మంది చనిపోయినట్లు జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. వెదర్ ఎమర్జెన్సీ ప్రకటించారు ఆ దేశ ప్రధాని షింజో అబే. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా చెప్పారు. అదే విధంగా 20 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. 73వేల ఇల్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. కరెంట్ లేదు. పునరుద్ధరణకు మరో వారం, 10 రోజులు అయినా పట్టే అవకాశం ఉందని తెలిపింది ప్రభుత్వం. సైన్యం రంగంలోకి దిగింది. బాధితులకు ఆహారం, మంచినీళ్లు అందిస్తున్నారు. సమాచార, రవాణా వ్యవస్థ కూడా పని చేయటం లేదు. 1983 తర్వాత జపాన్ లో ఇంత భారీ వర్షాలు, వరదలు రావటం ఇదే అంటున్నారు. దీనికితోడు కొన్ని ప్రాంతాల్లో భూకంపం రావటంతో ప్రజలు ఇళ్లు నుంచి పరుగులు తీశారు. బయట భారీ వర్షం.. దీంతో రోడ్లపైనే వర్షంలో తడుస్తూనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికారు జపాన్ ప్రజలు.

Posted in Uncategorized

Latest Updates