జపాన్ తరహాలో టెంపరేచర్ ఫిక్స్ : ఏసీ మనదే.. రిమోట్ సర్కార్ దే

AC-Indiaఏసీ.. ఇప్పడు కామన్ అయిపోయింది. ఇంట్లో ఫ్యాన్, లైట్ ఎలాగో.. ఏసీ కూడా అలాగే అన్నట్లుగా ప్రజల ఆలోచన మారిపోయాంది. ఒకప్పుడు సంపన్నులకే పరిమితం అయిన ఏసీలు.. ఇప్పుడు దిగువ మధ్య తరగతికి కూడా చేరువైంది. టెక్నాలజీ మరింత అప్ డేట్ తో కరెంట్ బిల్లు కూడా తక్కువగా వస్తుండటం, పాతిక వేలు పెడితే బ్రాండెడ్ ఏసీలు ఇంటికి వస్తుండటంతో వినియోగం విపరీతంగా పెరిగింది. ప్రతి ఏటా 5 నుంచి 7శాతం విక్రయాలు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో కరెంట్ వినియోగం, వాతావరణ కాలుష్యం బాగా పెరుగుతుంది. రిమోట్ ఉంది కదా అని ఇష్టానుసారం టెంపరేచర్స్ మార్చటం మంచిది కాదంటున్నారు నిపుణులు. బయట వాతావరణంకి అనుగుణంగా ఉండాలని సూచిస్తున్నారు. లేకపోతే ఆరోగ్య సమస్యలు కూడా చుట్టుముట్టే ప్రమాదం ఉందనేది డాక్టర్ల మాట. వీటన్నింటికీ చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం జపాన్ దేశం విధానాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నది.

ఏసీల తయారీలోనే కనిష్ఠ – గరిష్ఠ ఉష్ణోగ్రతలను రిమోట్ లో ఫిక్స్ చేయటం. ఇక నుంచి భారతదేశంలో విక్రయించే ప్రతి ఏసీలో మినిమం టెంపరేచర్ 24 డిగ్రీలుగా ఉంటుంది. అత్యధికంగా 28డిగ్రీలుగా ఫిక్స్ కానుంది. అంటే మీ ఏసీ రిమోట్ లో టెంపరేచర్ 24 కంటే డౌన్ ఉండదు. అదే విధంగా 28కి అప్ ఉండదు. ఈ మధ్యలోనే మీ రూం టెంపరేచర్ ఫిక్స్ అవుతుంది. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం ఏసీలు తయారు చేసే అన్ని కంపెనీలకు ఆదేశాలు ఇవ్వాలని ఆలోచిస్తోంది.

జపాన్ దేశంలోనూ ఇదే తరహా విధానం అమల్లో ఉంది. ఆ దేశంలో ఏసీల్లో 26 – 28 మధ్య ఏసీ టెంపరేచర్ ఫిక్స్ చేశారు. అంత కంటే తగ్గదు, పెరగదు. పదేళ్ల క్రితమే ఈ విధానాన్ని తీసుకొచ్చింది. దీని వల్ల ప్రజల్లోనూ ఆరోగ్య సమస్యలు తగ్గటమే కాకుండా.. ఏసీ వల్ల పెరిగిన విద్యుత్ వినియోగం తగ్గింది.. పొల్యూషన్ కంట్రోల్ లో ఉంది. ఏసీల్లో టెంపరేచర్ ను తయారీ సమయంలోనే ఫిక్స్ చేయటం వల్ల సత్ఫలితాలను సాధించింది జపాన్ దేశం. ఇప్పుడు భారతదేశం కూడా ఈ దిశగా అడుగులు వేస్తోంది. 130 కోట్ల మంది జనాభా.. అందులోనూ మధ్యతరగతి ప్రజలు అధికంగా.. ఏసీ వినియోగాన్ని తగ్గించటం కష్టం కాబట్టి.. అందులో టెంపరేచర్ ను ఫిక్స్ చేయటం వల్ల అనుకున్న లక్ష్యాన్ని సాధించొచ్చని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చింది. అమల్లోకి తీసుకురావటమే మిగిలింది..

Posted in Uncategorized

Latest Updates