జపాన్ లో భూకంపం

japanజపాన్‌లో సోమవారం వేకువజామున భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై దీని తీవ్రత 6.1గా నమోదైంది. జపాన్‌ భూకంపకేంద్రం 35.2 డిగ్రీల ఉత్తర అక్షాంశాలు, 132.6 డిగ్రీలు తూర్పు రేఖాంశాల మధ్య 10 కి.మీల లోతున ఓడా పట్టణంలో ఈ భూకంపం సంభవించినట్లు ప్రకటించింది మెటియోరాలాజికల్‌ ఏజెన్సీ(జేఎంఏ).

ఈ భూకంపంతో పట్టణంలో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. అలాగే నీటి సరఫరా సమస్య సైతం తలెత్తింది. ఈ భూకంపం వల్ల పట్టణంలో పలు భవనాలకు, రోడ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి.  కానీ న్యూక్లియర్‌ పవర్‌ స్టేషన్లకు ఎటువంటి ప్రమాదం కలగలేదు. ఎటువంటి సునామీ హెచ్చరికలు కూడా జారీ చేయలేదు అధికారులు.

Posted in Uncategorized

Latest Updates