జబర్దస్త్ కమెడియన్ హరిబాబు : అమ్మ ఆరోగ్యం కోసం ఎర్రచందనం స్మగ్లింగ్ చేశా


ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో జబర్ధస్త్ కమెడియన్ హరిబాబు పోలీసులు ఎదుట లొంగిపోయాడు. మంగళవారం, జూలై 17న అరెస్ట్ చూపించారు పోలీసులు. శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో కమెడియన్ హరిబాబు ఉన్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి కూడా. ఆరు సంవత్సరాలుగా ఎర్రచందనం అక్రమంగా రవాణా చేస్తున్నట్లు వెల్లడించారు పోలీసులు.

తిరుపతిలో ఓ సాధారణ ఉద్యోగిగా ఉన్న హరిబాబు.. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి.. టీవీ సీరియల్స్‌, జబర్ధస్త్ కామెడీ షోలో, కొన్ని సినిమాల్లో నటించాడు. ఓ రోజు తల్లి అనారోగ్యానికి గురైంది. డబ్బులు లేకపోతే ట్రీట్ మెంట్ చేయం అని ఆస్పత్రి చెప్పింది. రెండు గంటలు డాక్టర్లు పట్టించుకోలేదు.. అమ్మ ఆరోగ్యం బాగుచేయటం కోసం గత్యంతరం లేక ఒకే ఒక్కసారి ఎర్రచందనం స్మగ్లింగ్ చేశానని చెప్పాడు. నాపై 20 కేసులు ఉన్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నాడు హరిబాబు. తిరుపతి ట్రాఫిక్ పోలీస్ విభాగంలో పని చేసే ఓ కానిస్టేబుల్ నాపై కక్ష కట్టి.. ఈ కేసుల్లో ఇరికించినట్లు చెబుతున్నాడు. గతంలో టాస్క్ ఫోర్స్ లో పని చేసి.. ఇటీవల ట్రాఫిక్ కు బదిలీ అయినట్లు చెప్పాడు. ఆ కానిస్టేబుల్ పగ తీర్చుకోవటం కోసమే.. నన్ను ఇరికించినట్లు కూడా చెబుతున్నాడు హరిబాబు.

కొన్ని సంవత్సరాలుగా తప్పించుకు తిరుగుతున్న హరిబాబుపై 10 పోలీస్‌ స్టేషన్లలో.. 13 కేసులు ఉన్నట్లు చెబుతున్నారు పోలీసులు. ఇప్పటికే ఓసారి పట్టుబడినట్లు కూడా చెబుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates