జబర్ధస్త్ అనసూయ వీరంగం : ఫొటోలు తీస్తే.. ఫోన్ పగలగొట్టింది

Anasuya-Bharadwajయాంకర్ అనసూయకి కోపం వచ్చింది.. వీరావేశం ప్రదర్శించింది. ఇష్టమైన యాంకర్ ఫొటో తీసుకోవాలని.. సెల్ఫీ దిగుదామని ఆశతో వచ్చిన ఓ చిన్నారితో చిర్రుబుర్రులాడింది. అంతటితో ఆగితే పర్వాలేదు.. ఆ చిన్నారి చేతిలోని ఫోన్ తీసుకుని నేలకేసి కొట్టింది. పాపం వేల రూపాయల విలువైన ఫోన్ పగిలిపోయింది. అభిమానంగా వస్తే ఇంతలా అవమానిస్తుందా అని అనసూయపై ఆ బాలుడి తల్లి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సెల్ఫీ దిగితే దిగింది.. లేకపోలే లేదని చెప్పాలి గానీ.. ఇలా అభిమానులపై వీరంగం చేయటం ఏంటీ.. మరీ ఓవరాక్షన్ కాకపోతే అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

యాంకర్ అనసూయ తన వ్యక్తిగత పనిపై హైదరాబాద్ లోని తార్నకకి వెళ్లింది. అక్కడే రోడ్డుపై నిలబడి ఎవరితోనో మాట్లాడుతున్నది. అటుగా వెళుతున్న ఓ చిన్నారి ముచ్చటపడి ఫోటోలు తీశాడు. దగ్గరికి వెళ్లి సెల్ఫీ దిగాలని ఆశ పడ్డాడు. ఇది చూసిన అనసూయ.. ఫొటోలు తీస్తావా అంటూ ఫోన్ లాక్కొని నేలకేసి కొట్టింది. ఈ విషయాన్ని గమనించిన బాలుడి తల్లి పరిగెత్తుకుంటూ వచ్చింది. అనుసూయతో వాగ్వావాదానికి దిగింది. ఫోన్ పగలగొట్టటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా వినకుండా తిడుతూ కారెక్కి వెళ్లిపోయింది అంటూ జబర్ధస్త్ అనసూయపై ఆరోపణలు చేస్తోంది బాలుడి తల్లి. ఈ జబర్ధస్త్ యాంకర్ పై ఓయూ పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ చేసింది బాలుడి తల్లి..

Posted in Uncategorized

Latest Updates