జబర్ధస్త్ పంచ్ లు : రోడ్ సేఫ్టీపై అనసూయ వీడియో.. కడిగిపారేస్తున్న నెటిజన్లు

ప్రముఖ యాంకర్, నటి, సోషల్ మీడియా సెలబ్రిటీ అయిన అనసూయ తీసిన, పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ రూల్స్ పై మాట్లాడింది. ఆ వీడియోను ట్విట్టర్ ద్వారా ట్రాఫిక్ పోలీసులకు ట్యాగ్ చేసింది. ఆ వీడియో ఏంటో ఇప్పుడు చూద్దాం..

జూలై 18వ తేదీ రాత్రి హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 నుంచి అనసూయ వెళుతున్నారు. ఆమెతో డ్రైవర్ ఉన్నాడు. ట్రాఫిక్ లో నిలిచిపోయింది. ఆ సమయంలో తన కారు పక్కనే మరోకారు వచ్చి ఆగింది. ఆ కారు డ్రైవర్ తన మొబైల్ ఫోన్ ను స్టిరింగ్ పక్కన హ్యాంగ్ చేసి పెట్టాడు. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మొబైల్ లో సినిమా చూస్తూ ఉన్నాడు. ఈ వీడియోను తన కారు నుంచి తీసిన అనసూయ ఆ కామెంట్ ఈ విధంగా పెట్టారు.

డియర్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్.. ఇలాంటి సంఘటనలు నన్ను బాగా భయపెట్టిస్తున్నాయి. గతంలో వేరే వారి తప్పిదం వల్ల నేను కారు ప్రమాదానికి గురయ్యాను. ఇలాంటి నిర్లక్ష్యపు డ్రైవర్స్ ను వదలొద్దు. రోడ్డుపైకొచ్చి తమ ఇష్టమొచ్చినట్లు డ్రైవ్ చేసేవారికి ఇతరుల ప్రాణాలంటే లెక్కలేదా.. అంటూ ప్రశ్నించారు. అనసూయ వీడియో తీసే సమయానికి కారు ఆగి ఉంది. రన్నింగ్ లో లేదు.

అనసూయ తన ట్విటర్ లో పోస్ట్ చేసిన ఈ వీడియోపై నెటిజన్లు నెగెటివ్ గా స్పందిస్తున్నారు. కారు ఆగే ఉంది కదా.. డోర్ తీసి ఆ డ్రైవర్ కు చెప్పొచ్చు కదా అంటూ కౌంటర్ ఇస్తున్నారు. మరికొందరు అయితే ఇలాంటి చీప్ పబ్లిసిటీ కోసం ఇంకా ఎన్నాళ్లు పాకులాడతారు అంటూ పంచ్ లు వేస్తున్నారు. మరికొందరు అయితే కారు రన్నింగ్ లో లేదు.. ఆగి ఉంది.. ఎంతసేపటి నుంచి ఆగి ఉందో తెలుసా.. కారు రన్నింగ్ ఉంటే వీడియో ఆపేసేవాడేమో కదా అని ప్రశ్నిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులకు ట్యాగ్ చేయటం వల్ల అతనికి ఫైన్ పడుతుంది.. అతని ఉపాధి కోల్పోతాడు ఇది మీకు తగునా అని అంటున్నారు. ఇలాంటి నిర్లక్ష్యపు డ్రైవర్లను వదలొద్దు అని అన్నారు.. తప్పకుండా వదలొద్దు.. కానీ దరిద్రపు గొట్టు డైలాగ్స్ తో పిల్లలను చెడగొడుతున్న మీ షోలను కూడా అలాగే వదిలేద్దామా అంటూ ప్రశ్నించారు.

తన వీడియోపై నెగెటివ్ కామెంట్లు వస్తున్నా అనసూయ లెక్కచేయలేదు. ఓ మంచి కాజ్ కోసం ఈ మాత్రం మాటలు పడటానికి కూడా రెడీ అంటున్నారు. వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. అనసూయ ట్యాగ్ చేసిన వీడియోపై ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. ప్లేస్, డేట్, టైం చెబితే సీసీ కెమెరా ద్వారా ఆ డ్రైవర్ పై చర్యలు తీసుకుంటాం అని స్పష్టం చేశారు. ఇక చాలా మంది ప్రశ్నలకు అనసూయ చాలా ఓపిగ్గా కూడా సమాధానం చెబుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates