జబర్ధస్త్ యాంకర్స్ కారుకి యాక్సిడెంట్

chalaki-chantiమహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం జాతీయ రహదారిపై యాక్సిడెంట్ జరిగింది. ప్రమాదానికి గురైన కారు జబర్ధస్త్ యాంకర్ చలాకీ చంటీది. ఈ కారులో చంటీతోపాటు మరో నటులు హరికృష్ణ, హరి చరణ్ కూడా ఉన్నారు. సోమవారం సాయంత్రం వీరందరూ కలిసి శ్రీకాళహస్తి నుంచి హైదరాబాద్ బయలుదేరారు. మంగళవారం తెల్లవారుజామున మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలోని బాలానగర్ దగ్గరకు చేరుకున్నారు. అదే సమయంలో వెనక నుంచి వేగంగా వచ్చిన మరో కారు వీరిని ఢీకొన్నది. ఈ ప్రమాదంలో రెండు కార్లలోని వాహనదారులకు ఎలాంటి గాయాలు కాలేదు. చలాకీ చంటీ కారు వెనక భాగం నుజ్జునుజ్జు అయ్యింది.

యాక్సిడెంట్ కేసుపై పోలీసులకు కంప్లయింట్ అందింది. విచారణ చేస్తున్నారు. చలాకీ చంటి కారు దెబ్బతినటంతో.. మరో కారులో జబర్ధస్త్ నటులు హైదరాబాద్ చేరుకున్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కూడా కాకపోవటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates