జబ్బులొస్తున్నాయి : పానీపూరీల అమ్మకాలపై బ్యాన్ విధించారు

వడోదర ప్రజలకు కొన్నిరోజులపాటు పానీపూరి తినే అవకాశం లేకుండా పోయింది. పానీపూరీల అమ్మకాలపై వడోదర మున్సిపాలిటీ తాత్కాలిక నిషేధం విధించింది. వర్షాకాలం సీజన్‌ కావడంతో…శుభ్రత లేకుండా తయారు చేసే పానీపూరిని తినడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వడోదర మున్సాపాలిటీ అధికారులు తెలిపారు. పరిశుభ్రత పాటించకుండా తయారుచేసే పానీపూరి తినడం వల్ల వడోదరలో టైఫాయిడ్, జాండీస్ వంటి రోగాలు వ్యాపిస్తున్నాయని అధికారులు తెలిపారు. వడోదరలోని కొన్ని పానీపూరి తయారీ చేసే ప్లేస్ లలో వడోదర మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు రెయిడ్ చేశారు. పానీపూరి తయారుచేయడానికి వినియోగిస్తున్న పాడైపోయిన పిండిని, కుళ్లిపోయిన బంగాలాదుంపలు, ఎక్స్ పైరీ డేట్ అయిపోయిన ఆయిల్ ను, కలుషితమైన నీరుని అధికారులు స్వాధీనం చేసుకొని.. వాటిని పారేశారు. వర్షాకాలం సీజన్ ముగిసేవరకూ ఎవ్వరూ కూడా పానీపూరీ అమ్మడానికి వీల్లేదని పుడ్ బిజినెస్ మ్యాన్ లకు వడోదర మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. పానీపూరీపై నిషేధం విధించడంతో సిటిలోని పానీపూరీ ప్రియులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates