జమిలి ఎన్నికలపై కేంద్రం కసరత్తు : లా కమిషన్ వివరణ కోరిన న్యాయశాఖ

electionsజమిలి ఎన్నికలపై కేంద్రం కసరత్తు ప్రారంభించింది. దీనికి సంబంధించిన 3 ప్రధాన అంశాలపై వివరణ ఇవ్వాలని కేంద్ర న్యాయ శాఖ .. లా కమిషన్ కు సూచించింది. ఎన్నికల నిర్వహణ ఖర్చు తగ్గుతుందా లేదా అనేదానిపై పూర్తి నివేదిక ను కోరింది. భారత రాజకీయ వ్యవస్థలోని ప్రజాస్వామ్యంపై జమిలి ఎన్నికలతో పడే ప్రభావం ఏంటో చెప్పాలని సూచించింది. జరుగుతున్న అభివృద్ధిపై మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్.. ప్రభావం చూపుతుందా అనేదానిపై వివరించాలని ఆదేశించింది.

పార్లమెంట్ , రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే.. కలిగే నష్టాల అంచనాలతో ఓ సమగ్రమైన నోట్ తయారుచేసింది న్యాయశాఖ. ఈ ప్రశ్నలకు వివరమైన సమాధానాలు ఇవ్వాలని లా కమిషన్ కు సూచించింది. ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే… 23 లక్షల ఈవీఎం మెషీన్లు… 25 లక్షల వీవీప్యాట్ యూనిట్లు అవసరం అని కేంద్రం భావిస్తోంది. ఈవీఎంల కోసం.. 4వేల ఆరు వందల కోట్ల రూపాయలు… వీవీ ప్యాట్ యూనిట్ల కోసం.. 4వేల 7వందల 50 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా. ఈ మెషీన్ల లైఫ్ టైమ్ 15 ఏళ్లు ఉంటుంది. ఆ తర్వాత వాటిని మార్చుకోవాల్సి ఉంటుంది. పదిహేనేళ్లలో కనీసం మూడుసార్లు మెషీన్లను వాడుకునేవీలుంది. ఒక్కసారి పదివేల కోట్లు ఖర్చు చేస్తే… ఓ పదిహేనేళ్ల దాకా మళ్లీ ఖర్చు ఉండదని న్యాయ శాఖ అనుకుంటోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. ఈవీఎంలను తయారు చేయించడం.. అన్ని రాష్ట్రాలకు తరలించడం.. బాగా లేనివాటిని రిపేర్ చేయించడం ఖర్చుతో కూడుకున్నదే అని కేంద్రం భావిస్తోంది.

ఎన్నికల బందోబస్తు ఖర్చు పెంచుతుందా అనేది న్యాయశాఖ మరో సందేహం సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీస్ ఫోర్స్ లాంటి సెక్యూరిటీ బలగాలు సరిపడా ఉన్నాయా.. వారిని అన్ని ప్రాంతాలకు తరలించడం సాధ్యమేనా.. దీనివల్ల ఖర్చు పెరుగుతుందా అనే అంశాలపైనా వివరణ కోరింది న్యాయశాఖ. మెజారిటీ రాష్ట్రాల్లో అప్పటికే అధికారంలో ఉన్న పార్టీ… ఓటర్లను ప్రభావితం చేస్తుందా అనేది తెల్సుకోవాలనుకుంటోంది. ఎన్నికలకు ముందు అమలుచేసే పథకాలు ఎలా ఉండాలి.. వాటిపై ఆంక్షలు ఎలా ఉండాలి.. అనేదానిపైనా వివరణ కోరింది. అభివృద్ధికి ఆటంకపడకుండా.. కోడ్ ఆఫ్ కాండక్ట్ 35 రోజుల్లోనే ముగించాలని అనుకుంటోంది కేంద్రం.

Posted in Uncategorized

Latest Updates