జమ్మికుంట పిల్లల మానవత్వం : తలా పిడికెడు బియ్యంతో నిరుపేదలకు ఆసరా

GUPPEDU RICEనిరుపేదలకు అండగా నిలిచేందుకు కొత్త కార్యక్రమం మొదలు పెట్టారు జమ్మికుంట పోలీసులు. తలా పిడికెడు బియ్యం.. పట్టడన్నం పేరుతో కార్యక్రమం నిర్వహించారు. ఒక్కో విద్యార్థి నుంచి పిడికెడు బియ్యం సేకరించి పేదలకు సాయం చేశారు. మూడు రోజుల్లో 70క్వింటాళ్ల బియ్యం సేకరించి..  పంచారు. దీనివల్ల విద్యార్థులకు మానవ విలువలు తెలుస్తాయన్నారు పోలీసులు.  కరీంనగర్ జిల్లా జమ్మికుంట పోలీసులు మరో వినూత్న కార్యక్రమం మొదలుపెట్టారు. నిరుపేదలకు మేమున్నామని భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.

జమ్మికుంటలోని వివిధ స్కూళ్లలో చదువుతున్న ప్రతీ విద్యార్థి పిడికెడు బియ్యం తీసుకొచ్చేలా ప్రచారం చేశారు.  ఇలా మూడో రోజుల్లో 70క్వింటాళ్ల బియ్యం సేకరించారు. విద్యార్థుల నుంచి సేకరించిన బియ్యాన్ని జమ్మికుంటలోని 7వందల మంది నిరుపేదలకు తలా 10కిలోల చొప్పున  పంచారు. విద్యార్థుల చేతలు మీదుగా బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ సీపీ కమలహాసన్ రెడ్డి  హాజరయ్యారు. ఇంతమంచి కార్యక్రమం చేపట్టిన జమ్మికుంట సీఐ ప్రశాంత్ రెడ్డి, పోలీసులను అభినందించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు ఈ కార్యక్రమంలో భాగమయ్యాయని చెప్పారు జమ్మికుంట సీఐ ప్రశాంత్ రెడ్డి. ఇది ఒక్క రోజుతో ముగియదన్నారు. పిల్లలకు చదువుతో పాటు మానవ విలువలు నేర్పాలనే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు పోలీసులు. దాంతో పాటు నలుగురు పేదలకు కడుపు నిండుతుందన్నారు.

Posted in Uncategorized

Latest Updates