జమ్ముకశ్మీర్ లో ఎన్ కౌంటర్.. నలుగురు టెర్రరిస్టులు హతం

జమ్ముకశ్మీర్ లో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పుల్వామా జిల్లాలో ఇవాళ(శనివారం) జరిగిన ఈ కాల్పుల్లో… నలుగురు టెర్రరిస్టులు హతమవ్వగా… 16 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. పుల్వామాలోని  రాజ్ పోరా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారని నిఘా వర్గాలకు సమాచారం అందింది.

దీంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో కార్డన్ సర్చ్ చేస్తుండగా.. టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. అలర్టైన భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపారు. కాల్పుల్లో మృతిచెందిన టెర్రరిస్టులంతా జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థకు చెందిన వారని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి భద్రతా బలగాలు భారీగా ఆయుధాలు, పేలుడు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.

Posted in Uncategorized

Latest Updates