జమ్ముకశ్మీర్ లో కాల్పులు: ఇద్దరు జవాన్లు మృతి

జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇద్దరు  CRPF జవాన్లు చనిపోయారు. అనంతనాగ్ లోని అచాబల్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవాన్ల క్యాంపుపై టెర్రరిస్టులు మెరుపుదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో CRPF అధికారి తో పాటు ఓ జవాన్ మరణించారు. మరొకరు గాయపడ్డాడు. ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్‌ సిబ్బందిపై కాల్పులు జరపగా జవాన్లు ఎదురుదాడికి దిగినట్లు అధికారులు తెలిపారు.

చనిపోయిన ఇద్దరు CRPF జవాన్లను అసిస్టెంట్‌ సబ్‌-ఇన్స్‌పెక్టర్‌ మీనా, కానిస్టేబుల్‌ సందీప్‌లుగా గుర్తించారు. కాల్పులు జరిగిన ప్రాంతంలో భద్రతను పెంచిన పోలీసులు ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు.

Posted in Uncategorized

Latest Updates