జమ్ముకశ్మీర్ లో కాల్పులు: ముగ్గురు ఉగ్రవాదులు మృతి

జమ్మూకశ్మీర్‌లోని ఫతే కదాల్ ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఒక జవాను ప్రాణాలు కోల్పోయాడు. ఫతే కదాల్ ఏరియాలో ఓ ఇంట్లో ఉగ్రవాదులు తల దాచుకున్నారనే సమాచారం తెలుసుకున్న బలగాలు… అక్కడికి చేరుకొని కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులకు, బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. నిన్న(మంగళవారం) సాయంత్రం నుంచి ఇవాళ (బుధవారం) ఉదయం వరకు ఎదురుకాల్పులు కొనసాగాయి. ఎదురుకాల్పుల్లో జవాను కమల్ కిశోర్ మృతి చెందాడు. ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. వీరిలో ఇద్దరిని పోలీసులు గుర్తించారు. మెహ్రాజ్ ఉద్ దిన్ బంగ్రూ, ఫయిద్ ముస్తాక్ వజాగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మెహ్రాజ్‌పై పలు హత్య, ఆయుధాలను దొంగిలించిన కేసులు ఉన్నాయి.

Posted in Uncategorized

Latest Updates