జమ్ముకశ్మీర్ లో పోలింగ్.. బీజేపీ అభ్యర్థిగా మాజీ టెర్రరిస్ట్

జమ్ము కశ్మీర్ : జమ్ముకశ్మీర్ లో స్థానిక సంస్థలకు రెండో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం నుంచే పకడ్బందీ సెక్యూరిటీ నడుమ పోలింగ్ జరుగుతోంది. ఆర్టికల్ 35పై కేంద్రం క్లారిటీ ఇవ్వడం లేదంటూ… నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ పార్టీలు ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోలింగ్ జరుగుతోంది. అనంతనాగ్ లో పోలింగ్ తక్కువగా నమోదవుతోంది.

శ్రీనగర్ లో ఓ మాజీ టెర్రరిస్ట్ తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు. శ్రీనగర్ అర్బన్ లోకల్ బాడీ ఎన్నికల్లో ఓ స్థానం నుంచి బీజేపీ తరఫున మాజీ టెర్రరిస్ట్ ఫరూక్ అహ్మద్ ఖాన్ బరిలో దిగారు. ఉదయాన్నే ఓ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశాడు.

జమ్ముకశ్మీర్ లోకల్ బాడీ ఎన్నికలు నాలుగు దశల్లో జరుగుతున్నాయి. మొదటి దశ పోలింగ్ సోమవారం జరిగింది. బుధవారం రెండో దశ పోలింగ్ నిర్వహిస్తున్నారు. 13 జిల్లాల్లోని 384 వార్డుల్లో పోలింగ్ నడుస్తోంది.

Posted in Uncategorized

Latest Updates