జమ్ములో అల్లర్లు : రంగంలోకి దిగిన మహిళా కమాండోలు

jammuజమ్ము కశ్మీర్ లో కొనసాగుతున్న రాళ్ల దాడులు భద్రతా దళాలకు సవాల్ గా మారాయి. రాళ్లు విసిరే అల్లరి మూకల్లో మహిళలు కూడా ఎక్కువగా ఉండటంతో వారిని ఎదుర్కొనేందుకు … మహిళా కమాండోలను రంగంలోకి దించేందుకు సీఆర్ పీఎఫ్  సిద్ధమైంది. అలాంటి ప్రత్యేక సందర్భాల్లో ఉపయోగించుకునేందుకు ప్రత్యేకంగా మహిళా కమాండోలకు  ట్రైనింగ్ ఇస్తోంది.

సూపర్ 500 పేరుతో ప్రత్యేక మహిళా కమాండోల బృందం ప్రస్తుతం శిక్షణలో ఉంది. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో.. అన్ని సవాళ్లను ఎదుర్కొనేలా ట్రైనింగ్ లో మహిళా కమేండోలను సిద్ధం చేస్తున్నారు ఉన్నతాధికారులు. చీకట్లో కూడా తుపాకీని పూర్తిగా విడదీసి మళ్ళీ యథాతథంగా పేర్చడం కూడా నేర్పిస్తున్నారు. వివిధ రకాల తుపాకులు, ఆయుధాల వినియోగాన్ని ట్రైనింగ్ లో చెబుతున్నారు.

రాళ్లదాడులకు పాల్పడే మహిళలను అదుపు చేసేందుకు ఈ స్పెషల్ టీమ్ కు ట్రైనింగ్ ఇస్తున్నామంటున్నారు అధికారులు. వీరికి ఆయుధాలను వాడటంతో పాటు ప్రతికూల పరిస్థితులను ఎలా అధిగమించాలనే అంశాలపై కఠోర శిక్షణ ఇస్తున్నట్టు చెబుతున్నారు. ఎన్నికలప్పుడు కూడా వీరిని వినియోగించుకోవచ్చని అంటున్నారు.  ట్రైనింగ్ పూర్తయిన తర్వాత.. త్వరలోనే మహిళా కమాండోలను పూర్తిస్థాయిలో దేశ రక్షణ కోసం ఉపయోగిస్తామంటున్నారు CRPF ఉన్నతాధికారులు.

Posted in Uncategorized

Latest Updates