జమ్ములో భారత్ కాల్పులు..ఐదుగురు ఉగ్రవాదులు మృతి

MAVOజమ్మూ సరిహద్దులో ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది భారత  సైన్యం. తగ్దర్ సెక్టార్ లో ఉగ్రవాదులు బార్డర్ దాటేందుకు ప్రయత్నిస్తుండగా సైన్యం గుర్తించింది. వెంటనే కాల్పులు ప్రారంభించింది. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు ఐదుగురు చొరబాటుదారులు చనిపోయారు. ఉగ్రవాదులు బార్డర్ దాటేందుకు ప్రయత్నించిన ప్రాంతాన్ని బలగాలు చుట్టుముట్టాయి. ఉగ్రవాదులపై కాల్పులు జరుపుతున్నాయి. ఉగ్రవాదుల దగ్గర భారీగా ఆయుధాలున్నట్టు అధికారులు చెబుతున్నారు.

 

Posted in Uncategorized

Latest Updates