జమ్మూకశ్మీర్‌లో కాల్పులు..ఇద్దరు పోలీసులు మృతి

bsfజమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భద్రతా దళాలే లక్ష్యంగా దాడులకు దిగారు. మంగళవారం (జూన్-12) తెల్లవారుజామున పుల్వామాలో కోర్టు దగ్గర ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు మృతి చెందారు. అనంత్‌నాగ్‌లో ఉగ్రవాదులు గ్రనేడ్‌ దాడి చేశారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో ఉగ్రవాదులు పారిపోయారు. సమాచారం అందినవెంటనే ఆర్మీ, CRPF, పోలీస్ పార్టీలు స్పాట్ కు చేరుకున్నాయి. ఉగ్రవాదుల కోసం ఆ ఏరియా మొత్తం గాలిస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటనలో 10 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి.

Posted in Uncategorized

Latest Updates